Friday, December 3, 2010

కోళ్ళ జాతులు

కోళ్ళ జాతులు

సెంట్రల్ ఏవియన్ రీసెర్చి ఇనిస్టిట్యూట్, ఇజత్ నగర్ నుండి తయారు చేసిన జాతులు.

దేశవాళీ రకాలు

కారీ నిర్ బీక్ ( అసీల్ క్రాస్)


  • అసీల్ అంటే ‘స్వచ్ఛత’ అని అర్థం. ఈ జాతి కోళ్ళు బాగా బలంగా, తట్టుకునే శక్తి ఎక్కువగా, దెబ్బలాడే గుణం ఎక్కువగా ఉంటాయి.
  • ఈ జాతి కోళ్ళకు మన రాష్ట్రం పుట్టినిల్లు.
  • ఈ కోళ్ళ చాలా పెద్దవిగా, అందంగా ఉంటాయి.
  • పుంజులు 3-4 కిలోల వరకు బరువు ఉండి, పెట్టలు 2-3 కిలోల ఉంటాయి.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 196 రోజులు
  • సంవత్సరములో గ్రుడ్లు ఉత్పత్తి -92
  • 7. 40 వారాల వయస్సులో గ్రుడ్ల బరువు 50గ్రా.

కారీ శ్వామా (కడకనాథ్ క్రాస్)


  • ప్రాంతీయంగా ‘కలమాశి’ అంటారు, అంటే దీని అర్ధం నల్లని మాంసం కలది – మధ్యప్రదేశ్ లోని జాబ్యూ మరియు ధర్ జిల్లాలు, రాజస్ధాన్ మరియు గుజరాతీ ప్రాంతాలలో సుమారు 800 చ. మైలుల్లో వ్యాపించి ఉన్నది.
  • వీటిని ఎక్కువగా కొండ జాతులు, ఆదివాసి ప్రజలు, పేదవాళ్ళు పెంచుతారు. దీనిని పవిత్ర మైన జాతిగా గుర్తించి, దీపావళి రోజున దేవునికి నైవేధ్యంగా పెడతారు.
  • రోజుల కోడి పిల్ల నీలం రంగు నుంచి నలుపు వరకు ఉండి, వీపు మీద ముదురు రంగు గీతలు ఉంటాయి. ఈ జాతి మాంసం నల్లగా ఉన్నా, దీనికి చాలా ఔషధ విలువలు ఉన్నాయి.
  • ఆదివాసీ దీని రక్తాన్ని చాలా జబ్బులకు ఉపయోగిస్తారు.
  • గ్రుడ్లు, మాంసం లో ప్రొటీన్లు (25.47%) మరియు ఇనుము ఎక్కువగా ఉంటుంది.
  • 20 వారాల వయస్సులో 920గ్రాముల బరువు ఉంటుంది.
  • గ్రుడ్లు పెట్టే వయస్సు – 180 రోజులు.
  • సంవత్సరనికి గ్రుడ్ల ఉత్పత్తి – 105
  • 40 వారాల వయస్సుకి గ్రుడ్ల బరువు 49 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 55%

హితకారీ ( నేకడ్ నెక్ క్రాస్)

  • ఈ జాతి పెద్దగా ఉండి పొడవైన ఈకలు లేని మెడ ఉంటుంది.
  • మగ కోడిలో పరిపక్వ దశకు వచ్చే సరికి మెడ భాగం ఎర్రగా మారుతుంది.
  • కేరళ లోని త్రివేండ్రం దీనికి పుట్టినిల్లు.
  • 20 వారాలు వయస్సులో దాని బరువు 1005 గ్రా
  • గ్రుడ్లు పెట్టే వయస్సు 201 రోజులు.
  • గ్రుడ్ల ఉత్పత్తి సంఖ్య 99 సంవత్సరానికి
  • 40 వారాలు వయస్సులో గ్రుడ్లు బరువు 54 గ్రా
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం - 66%

ఉపకారి (ఫ్రిజెల్ క్రాస్)

Frizzle Cross.JPG

  • దేశవాళీ కోడిలాగా ఉండి, ఉష్ణ ప్రాంతాలకు, బాగా అలవాటు పడి, రోగనిరోధక శక్తి బాగా ఉండి, మంచి పెరుగుదల, ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంటుంది.
  • పెరటిలో పెంచేందుకు బాగా అనువైనది.
  • ఉపకారి కోళ్ళ వివిధ వాతావరణ పరిస్ధితులకు అనువైన రకాలు
  • కడకనాధ్ x డెహలామ్ రెడ్
  • అసిల్ x డెహలామ్ రెడ్
  • నేకడ్ నెక్ x డెహలామ్ రెడ్
  • ఫ్రిజిల్ x డెహలామ్ రెడ్
  • గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు – 170-180 రోజులు.
  • వార్షిక గ్రుడ్ల ఉత్పత్తి – 165-180 గ్రుడ్లు
  • గ్రుడ్ల బరువు – 52-55గ్రా
  • బ్రౌను రంగు గ్రుడ్లు
  • గ్రుడ్లు నాణ్యత బాగుంటుంది.
  • బతకగల సామర్ధ్యం 95%
లేయర్లు
కారీ ప్రియ లేయరు
  • మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు – 17-18 వారాలు
  • 150 రోజులకు 50% ఉత్పత్తి
  • 26 నుంచి 28 వారాలకు ఎక్కువ ఉత్పత్తి
  • బతకగల సామర్ధ్యం 96%
  • గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
  • గ్రుడ్డు బరువు 54గ్రా
కారీ సొనాలి లేయరు (గోల్డెన్ -92)

  • మొదటి గ్రుడ్డు పెట్టే వయస్సు – 18-19 వారాలు
  • 155 రోజులకు 50% ఉత్పత్తి
  • 27 నుంచి 29 వారాలకు ఎక్కువ ఉత్పత్తి
  • బతకగల సామర్ధ్యం 96%
  • గ్రుడ్డు సైజు సాధారణంగా ఉంటుంది.
  • గ్రుడ్డు బరువు 54గ్రా
కారీ – దేవేందర్
  • మద్యస్థ సైజు ఉన్న రెండు అవసరాలకు సరిపడే కోడి
  • మేత ఖర్చు కన్నా ఎక్కువ ఆదాయం వస్తుంది.
  • ఇళ్ళ దగ్గర చనిపోయే శాతం తక్కువ.
  • 8 వారాలకు కోడి బరువు – 1700-1800 గ్రా
  • గ్రుడ్లు పెట్టేందుకు వయస్సు- 155-160 రోజులు
  • వార్షిక గ్రుడ్లు ఉత్పత్తి 190-200



బ్రాయిలర్లు

కారీబ్ర్ –విషాల్ ( కారీబ్రో -91


  • రోజుల పిల్ల బరువు – 43 గ్రా
  • 2. ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650 - 1700గ్రా
  • 3. ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2100-2200గ్రా
  • డ్రెసింగ్ శాతం 75%
  • బతకగల సామర్థ్యం 97-98%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.94 -2.20

కారీ – రైన్ బ్రో (బి-77)

  • రోజుల పిల్ల బరువు –41 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1300 గ్రా
  • ఏడు వారాలు వయస్సు ఉన్న కోడి బరువు- 1600 గ్రా
  • డ్రెసింగ్ శాతం 73%
  • బతకగల సామర్థ్యం 98-99%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 2.3

కారీబ్ర్ – ధనరాజు ( రంగులది)


  • రోజుల పిల్ల బరువు –46 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1600-1650 గ్రా
  • ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
  • డ్రెసింగ్ శాతం 73%
  • బతకగల సామర్థ్యం 98-99%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.90-2.10

కారీబ్ర్ – మృత్యుంజయ్ (కారీ నేకడ్ నెక్)


  • రోజుల పిల్ల బరువు –42 గ్రా
  • ఆరు వారాల వయస్సు ఉన్న కోడి బరువు – 1650-1700 గ్రా
  • ఏడు వారాల వయస్సు ఉన్న కోడి బరువు- 2000-2150 గ్రా
  • డ్రెసింగ్ శాతం 77%
  • బతకగల సామర్థ్యం 97-98%
  • ఆరు వారాలకు ఫీడ్ కన్వర్షెన్ నిష్పత్తి 1.9-2.0



క్వయిల్

ప్రస్తుత కాలంలో జపనీస్ క్వయిల్ ఒక సంచలనం సృష్టించింది. దేశంలో చాలా చోట్ల గ్రుడ్లకు మరియు మాంసం కొరకు దీని పెంపకాన్ని చేపడుతున్నారు.

ఈ పక్షుల పెంపకం లాభసాటిగా ఉంటుంది దానికి కారణాలు :

  • సంవత్సరానికి వీటి ఉత్పత్తి మూడు నుంచి నాలుగు తరాల వరకు జరుగుతుంది.
  • రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ.
  • వ్యాక్సిన్ లు వేయనవసరం లేదు.
  • తక్కువ నేల అవసరమవుతుంది.
  • పెంచడం సులభం
  • తొందరగా పరిణితి చెందుతుంది.
  • 42 రోజుల వయస్సు లోనే ఇవి గ్రుడ్లు పెడతాయి.

కారీ ఉత్తమ్

  • గ్రుడ్లు పొదిగే శాతం 60-76%
  • నాలుగు వారాలకు బరువు 150గ్రా
  • ఐదు వారాలకు బరువు 170-190గ్రా
  • నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.51
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.80
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా

కారీ ఉజ్వల్

  • గ్రుడ్లు పొదిగే శాతం 65%
  • నాలుగు వారాలకు బరువు 140గ్రా
  • ఐదు వారాలకు బరువు 170-175గ్రా
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.93
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25-28గ్రా

కారీ శ్వేత

  • గ్రుడ్లు పొదిగే శాతం 50-60%
  • నాలుగు వారాలకు బరువు 135గ్రా
  • ఐదు వారాలకు బరువు 155-165గ్రా
  • నాలుగు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.85
  • ఐదు వారాలకు మేత తినే సామర్ధ్యం 2.90
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా

కారీ పరల్ (కారీ ముత్యం)

  • గ్రుడ్లు పొదిగే శాతం 65-70%
  • నాలుగు వారాలకు బరువు 120గ్రా
  • రోజు వారీ తినే మేత సామర్ధ్యం 25గ్రా
  • 50% గ్రుడ్లు ఉత్పత్తి చేసే వయస్సు 8-10 వారాలు



గునియా కోళ్ళు(గిన్ని కోళ్ళు)

  • చిన్న, సన్న కారు రైతులకు పెంచుటకు అనువైనది.
  • కాదంబరి, చితంబరి, శ్యేతాంబరి అను రకాలు అందుబాటులో ఉన్నాయి.

ముఖ్య లక్షణాలు

  • చాలా దిట్టమైన పక్షి
  • ఏలాంటి వాతావరణానికైనా అనువైనది.
  • కోడికి వచ్చే చాలా జబ్బులను తట్టుకోగలదు
  • వీటి పెంపకం చాలా సులభతరం
  • మైకోటాక్సిన్ మరియు ఎఫ్లటాక్సిను తట్టుకోగలదు
  • అన్ని రకాల మేతను తింటుంది
  • గ్రుడ్లు పెంకు గట్టిగా ఉన్నందువల్ల, పగలటం తక్కువగా గమనించి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.
  • దీని మాంసం లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి మరియు క్రొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.

ఉత్పత్తి లక్షణాలు

  • 8 వారాలకు బరువు 500 -550 గ్రా
  • 12 వారాలకు బరువు 900-1000 గ్రా
  • మొదటి గ్రుడ్డు పెట్టేటప్పుటికి వయస్సు 230-250 రోజులు
  • గ్రుడ్డు బరువు 38-40గ్రా
  • గ్రుడ్లు ఉత్పత్తి 100-120
  • గ్రుడ్లు పెట్టే సామర్ధ్యం 70 – 75 %
  • గ్రుడ్లు పొదిగే సామర్ధ్యం 70 - 80%



టర్కీ కోళ్ళు

కారీ విరాట్

  • చాతీ వెడల్పుగా, తెల్లగా ఉంటుంది.
  • ఈ కోళ్ళు, బ్రాయిలర్ ఆడ కోడి 16 వారాల వయస్సులో 8 కిలోల బరువు ఉన్నప్పుడు, మగకోడి 12 కిలోల బరువు ఉన్నప్పుడు మార్కెట్ చేయబడుతుంది.

కోళ్ళ లభ్యతకు సంప్రదించ వలసిన చిరునామా :

డైరెక్టర్
సెంట్రల్ ఏవియన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్
ఇజాత్ నగర్,
ఉత్తర ప్రదేశ్
Pin: 243 122
ఇ.మెయిల్ :
cari_director@rediffmail.com
ఫోన్ : 91-581-2301220; 2301320; 2303223; 2300204
ఫాక్స్: 91-581-2301321








ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ హైదరాబాద్ నుంచి తయారు చేయబడిన కోళ్ళ జాతులు

వనరాజా


  • గ్రామీణ మరియు కొండ ప్రాంతాలలో పెరటిలో పెంచుటకు అనువైనది. ఇది రంగుల పక్షి
  • ఆడ కోడి 160-180 గ్రుడ్లు పెడుతుంది
  • తేలికగా ఉండి పొడవైన కాళ్ళు ఉన్నందునల్ల శత్రువుల నుంచి కాపాడుకోగలుగుతుంది.

క్రిషిబ్ర్


  • రంగు రంగుల వాణిజ్య పరమైన బ్రాయిలర్ కోళ్ళు.
  • ఆరు వారాలలో 2.2 కంటే తక్కువ ఫీడ్ కన్వర్షన్ నిష్పత్తిలే సాధారణ బరువుకి చేరుకుంటుంది.
  • 6 వారాల వయస్సు వరకు సుమారు 97% బతుకుతాయి
  • ఉష్ణ ప్రాంతాలకు బాగా అనువైనది.
  • చాలా దిట్టమైనది, బాగా బతకగల సామర్థ్యం కలది.
  • కోళ్ళకి సాధారణంగా వచ్చే జబ్బులను బాగా తట్టుకుంటుంది.

కోళ్ళ లభ్యతకు సంప్రదించవలసిన చిరునామా
డైరెక్టర్
ప్రాజెక్ట్ డైరెక్టరేట్ ఆన్ పౌల్ట్రీ
రాజేంద్ర నగర్, హైదరాబాద్ – 500030
ఆంధ్ర ప్రదేశ్, ఇండియా.
ఫోన్:- 91-40-24017000/24015651
ఫాక్స్ : - 91-40-24017002
ఇ-మెయిల్ : pdpoult@ap.nic.in



కర్నాటక వెటర్నరీ విశ్వవిద్యాలయం, బెంగుళూరు నుంచి రూపొందించిన జాతులు

గిరిరాజా : యు.ఎ.ఎస్, బెంగుళూరు ప్రస్తుతం కర్నాటక వారు రూపొందించారు.

స్వర్ణధార


  • 2005 లో కర్నాటక వెటర్ననీ విశ్వవిద్యాలయం నుంచి తయారు చేయబడినది.
  • ఒకసారి 15-20 గ్రుడ్లు పెడుతుంది.
  • ఈ కోళ్ళకు మంచి పెరుగుదలతో పాటు, గ్రుడ్లు పెట్టే సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది.
  • గిరిరాజా కోళ్ళతో పోలిస్తే, ఈ కోళ్ళు చిన్నవిగా, తేలికగా ఉండి శత్రువుల నుండి కాపాడుకోగలుగుతాయి.
  • గ్రుడ్లకు, మాంసానికి ఈ కోళ్ళను పెంచుతారు.
  • గ్రుడ్లు పొదిగిన తర్వాత 22-23 న వారంలో ఇవి పరిణితి చెందుతాయి.
  • ఆడ కోడి 3 కిలోలు, మగ కోడి 4 కిలోలు బరువు ఉంటుంది.
  • ఈ కోళ్ళు సంవత్సరములో 180-190 గ్రుడ్లు పెడుతుంది.

కోళ్ళకు సంప్రదించవలసిన చిరునామా :
ప్రొఫెసర్ & హెడ్,
డిపార్ట్ మెంట్ ఆఫ్ ఏపియల్ ప్రొడక్షన్ & మేనేజ్మెంట్
కర్నాటక వెటర్నరీ, ఏనియల్ సైన్స్ యూనివర్సిటీ
హెబ్బల్, బెంగుళూరు – 560024
ఫోన్: (080) 23414384 or 23411483 (ext)201.



ఇతర దేశవాళీ జాతులు

జాతి

పుట్టిన ప్రదేశము

అంకళేశ్వర్

గుజరాత్

అసీల్

ఆంధ్ర ప్రదేశ్ & మధ్యప్రదేశ్

బుస్రా

గుజరాత్ & మహారాష్ట్ర

చిట్ట

గాంగ్ మేఘాలయ & త్రిపుర

దంకి

ఆంధ్ర ప్రదేశ్

దోతిగిరి

అస్సాం

గాగుస్

ఆంధ్ర ప్రదేశ్ & కర్నాటక

హర్రింగాటా బ్లాక్

పశ్చిమ బెంగాల్

కడకనాథ్

మధ్యప్రదేశ్

కాళహస్తి

ఆంధ్ర ప్రదేశ్

కాశ్మీరి ఫావరోల్లా

జమ్మూ& కాశ్మీరు

మిరి

అస్సాం

నికోబరి

అండమాన్ & నికోబర్

పంజాబ్ బ్రౌన్

పంజాబ్ & హర్యానా

తెల్లి చెర్రి

కేరళ

1 comment: